దావోస్ లో జరిగిన ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పెట్టుబడులకు, దిగ్గజ కంపెనీలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పారు. రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సాధించిందని, ఈ ఘనత అంతా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వల్లనే సాధ్యమైందన్నారు. గేమ్ ఛేంజర్ గా రాష్ట్రం మారబోతోందన్నారు. గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందన్నారు.