ఐటీ అదుపులో నిర్మాత దిల్ రాజు
NEWS Jan 24,2025 10:52 am
ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి తెలుగు సినీ ఇండస్ట్రీని. ఎవరిపై ఎప్పుడు పడతారో తెలియక తంటాలు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. దిల్ రాజు, భార్య తేజస్విని, సోదరుడు శిరీష్, కూతురు స్నేహితా రెడ్డితో పాటు బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేపట్టారు. విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సాగర్ సొసైటీలో ఉన్న శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి దిల్ రాజును తీసుకు వెళ్లారు.