దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
NEWS Jan 24,2025 02:41 pm
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జువెల్లర్ దుకాణాల్లో సీసీ కెమెరాలు, హైసెక్యూరిటీ లాక్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ రాజావెంకట్ రెడ్డి షాప్ యజమానులకు సూచించారు. దొంగతనాలు, సైబర్ నేరాలపై వారికి అవగాహన కల్పించారు. ఏసీపీ దుకాణాల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించలన్నారు. వ్యాపారం ముగిసిన తరువాత గోల్డ్, క్యాష్ సేఫర్‌లో భద్రపర్చాలని, సేఫర్లు ఎవరికీ కనిపించని ప్లేస్‌లో పెట్టాలన్నారు. డిజిటల్ ట్రాన్సక్షన్స్ మాత్రమే చేయాలని తెలిపారు.గోల్డ్ తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు.