ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ బృందాలు జరుపుతున్న సోదాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆయన నిర్మాణ సారథ్యంలో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలయ్యాయి. చెర్రీ సినిమా ఢమాల్ కాగా వెంకీ మూవీ మాత్రం రూ. 230 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించి పలు కీలక పత్రాలు పరిశీలిస్తున్నారు. మహిళా అధికారి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇంట్లో తనిఖీలు ముగిశాయి.