మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్దంతి ఇవాళ. ఈ సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. పేద ప్రజల పక్షాన నిలిచి, నిరంతరం వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన ప్రజా నాయకుడు పరిరాట రవీంద్ర అని కొనియాడారు. సాహసమే ఊపిరిగా ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేమన్నారు. అరాచక శక్తులతో పోరాడి ప్రజల గుండెల్లో అస్తమించని రవిగా కొలువుదీరిన పరిటాల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.