సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటన అద్భుతంగా జరిగిందని, భారీ ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. ఏపీలో తాము ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్శిటీకి సహకారం అందించాలని తాను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కోరడం జరిగిందని చెప్పారు. ఆయనతో చాలా కాలం తర్వాత భేటీ కావడం, తాను చేసిన ప్రతిపాదనకు బిల్ గేట్స్ ఓకే చెప్పడం సంతోషం కలిగించిందన్నారు.