గురుకుల పాఠశాలల్లో భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి యోగితారాణా హెచ్చరించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధన పద్ధతులు, అధ్యాపకుల తీరును సమీక్షించారు. కళాశాల స్థాయిలో ప్రయోగశాలల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు.