తమిళ సినీ అగ్ర నటుడు దళపతి విజయ్ , దర్శకుడు పైడిపల్లి వంశీ హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్బంగా కీలక చర్చలు జరిపారు. విజయ్ కేసీఆర్ ను కలవడం రాజకీయ వర్గాలలో ప్రకంపనలు రేపాయి. తను ఇటీవలే కొత్త పార్టీని లాంఛ్ చేశారు. గతంలో కూడా కేసీఆర్ ను కలిశారు. దక్షిణాది పాలిటిక్స్ లో ఒకరు తలపండిన రాజకీయ నేత కాగా మరొకరు దిగ్గజ నటుడు, పొలిటికల్ లీడర్ కావడం గమనార్హం. దేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.