డిసెంబర్ 2021 లో వెలువడిన 317 జీవో ద్వారా ఉపాధ్యాయ దంపతులను వేర్వేరుగా నిజామాబాద్ జిల్లాకు బదిలీలు అయ్యారు గత 3 సంవత్సరాలుగా భార్య ఒక జిల్లాలో, భర్త ఒక జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఎంతో ఆవేదనకు మానసికంగా ఆందోళనకు గురియ్యారు. విద్యాశాఖలో 834 స్పౌజ్ బదిలీలను కాంగ్రెస్ చేపట్టింది. నిజామాబాద్ జిల్లాకు 57 మంది ఉపాధ్యాయులు స్పౌజ్ బదిలీల ద్వారా రావడం జరిగింది. సీఎం రేవంత్ కు సబ్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.