మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తండ్రీ కొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ ఎవరిని ఉద్దరించేందుకు దావోస్ పర్యటనకు వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖజానాకు బొక్క పడడం తప్పించింది వారి వల్ల రాష్ట్రానికి ఒనగూరించి ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు. తమ స్వంత ఇమేజ్ పెంచుకునేందుకు అక్కడికి వెళ్లారు తప్ప మరోటి కాదన్నారు. ఇద్దరూ ఉత్తి చేతులతో తిరిగి వచ్చారంటూ ఫైర్ అయ్యారు.