అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు జర్నలిస్టులు వారధులుగా నిలుస్తూన్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిరంతరం ప్రజలకు సమాచారం చేరవేస్తోన్న విలేకరుల కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం - 2025 మీడియా డైరీని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.