నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో షాక్ తగలింది. అప్పు చెల్లించాలని షకీల్ కు బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించ లేదని ఎస్బిఐ నోటీసులు జారీ చేసింది. 19 కోట్ల బకాయి గడువులోగా చెల్లించక పోతే ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటించింది. ఎస్బీఐ ఇచ్చిన నోటీసులపై ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కానీ, ఆయన అనుచరులు కానీ స్పందించలేదు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ప్రజాభవన్ వద్ద మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొట్టడంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.