తెలంగాణ ప్రభుత్వం అరుదైన రికార్డ్ సాధించింది. దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ రైజింగ్ బృందం కీలకంగా వ్యవహరించింది. దిగ్గజ కంపెనీ అమెజాన్ భారీగా పెట్టుబడి పెట్టింది. రూ. 60 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది సర్కార్. గత ఏడాది దావోస్ టూర్ లో రాష్ట్రానికి రూ. 40,232 కోట్లు సాధించింది.