దిగ్గజ సంస్థ అమెజాన్ సంచలన ప్రకటన చేసింది. దావోస్ కేంద్రంగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చల్లో భాగంగా అమెజాన్ హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు రూ. 60,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. డేటా సెంటర్ లో మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు దీనిని ఖర్చు చేస్తామని పేర్కొంది. ఐటీ పరంగా హైదరాబాద్ అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది.