అర్హులందరికీ సంక్షేమ పథకాలు
NEWS Jan 23,2025 06:25 am
సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తోందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. రైతు భ రోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి ఒక్కరు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్మూర్ మండలం గోవింద్ పేట్, మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామాలలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలలో కలెక్టర్ పాల్గొన్నారు.