బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు
NEWS Jan 23,2025 09:46 am
బోధన్ పట్టణంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బందికి క్రీడాపోటీలను ప్రారంభించినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పోశెట్టి, కోటేశ్వర్‌రావు తెలిపారు. క్యారం, షటిల్, చెస్, మహిళలకు టెన్నికాయిట్, ముగ్గుల పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్యారం పోటీలో సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సాయిశివ, స్పెషల్ మెజిస్ట్రేట్ శేషతల్పసాయి, ఏవో ఉమేష్ రావులు పాల్గొన్నారు.