ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కోలుకోలేని షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ముంబై అంథేరీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది కోర్టు. మూడు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆరేళ్ల కిందట నమోదైన కేసుకు సంబంధించి ఆర్జీవీని దోషిగా తేల్చింది. చెక్ బౌన్స్ అయ్యిందంటూ మహేష్ చంద్ర మిశ్రా శ్రీ కంపెనీ పేరుతో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు వర్మ. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.