సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చేసిన కృషి ఫలించింది. ఐటీ సంస్థ శివ నాడర్ కు చెందిన హెచ్ సీ ఎల్ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లో కొత్తగా టెక్ సెంటర్ ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.హెచ్ సీఎ ల్ టెక్ గ్లోబల్ సిఇఓ , ఎండీ విజయ్ కుమార్ తో సీఎం చర్చలు జరిపారు. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. 5 వేల మంది ఐటీ నిపుణులకు జాబ్స్ రానున్నాయి.