సైబర్ నేరగాళ్ల పట్ల..తస్మాత్ జాగ్రత్త ఎస్పీ
NEWS Jan 22,2025 06:30 pm
మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల విషయంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలని విలాసవంతమైన వస్తువులిస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని, రకరకాల మాయ మాటలతో మోసాలకు పాల్పడుతారన్నారు. వారి మాటలు ప్రజలు మోసపోవద్దన్నారు. మోసానికి గురైతే 1930కి కాల్ చేయాలన్నారు.