మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు 2 రోజుల జైలు శిక్ష పడిందని నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ SHO రఘుపతి తెలిపారు. డ్రంక్ & డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తి ముగ్గులపల్లి గ్రామం బాన్సువాడ మండల్ కామారెడ్డి జిల్లా చెందిన శంకర్ అత్యధిక మోతాదు మద్యం సేవించినట్లుగా తేలింది. బెల్కొని గ్రామం నాందేడ్ కు చెందిన రాజేష్ సాహెబ్రావ్ వాహనం నడిపించిన వ్యక్తి అత్యధిక మోతాదుగా వచ్చింది. శంకర్, రాజేష్ సాహెబ్రావ్ లకు న్యాయస్థానం ముందు హాజరుపరచగా 2 రోజుల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.