రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 317జీవో ద్వారా ఇతర జిల్లాలకు కేటాయించిన స్పౌజ్(భార్యాభర్తల) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భార్యాభర్తలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ నుంచి ఇద్దరు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 30 మంది టీచర్లు మంచిర్యాలకు.. మంచిర్యాల జిల్లా నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌కు ఒక్కొక్కరు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్‌కు 29మంది స్పౌజ్ కింద బదిలీ అయ్యారు.