నామినేటెడ్ పదవులకు సంబంధించి తుది నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడిదే నని స్పష్టం చేశారు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఎమ్మెల్యేలు చేసిన సిఫారసుల మేరకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజా మన్ననలు తమ సర్కార్ పొందుతోందన్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భారీ పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు సీఎం, లోకేష్ దావోస్ కు వెళ్లారని అన్నారు.