కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, డ్రైవర్ మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. కర్ణాటకలోని హంపి క్షేత్ర పర్యటనకు వెళ్లిన వారి వాహనం సింధనూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.