ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రత్యేక గ్రామసభలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులను గ్రామస్థులు నిలదీశారు. స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇంకెప్పుడు మంజూరు చేస్తారంటూ గ్రామస్థులు మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన సమాధానంపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.