ఏరోజుకు ఆ రోజు ఎస్ ఎస్ డి టోకెన్లు
NEWS Jan 22,2025 05:30 am
టీటీడీ ఈవో జె. శ్యామల రావు కీలక ప్రకటన చేశారు. శ్రీవారి భక్తులకు శుభ వార్త చెప్పారు. జనవరి 23 నుంచి తిరుపతిలో ఏ రోజుకు ఆరోజు ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ ఎస్ డి టోకెన్లను భక్తులు పొందవచ్చని స్పష్టం చేశారు. క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు దక్కుతాయని తెలిపారు.