శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.04 కోట్లు
NEWS Jan 22,2025 03:10 am
తిరుమల శ్రీవారిని 60,581 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 228 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో జె. శ్యామలా రావు వెల్లడించారు. దర్శనానికి ప్రస్తుతం డైరెక్టు లైన్ కొనసాగుతోందని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు కనీసం 5 గంటలకు పైగా సమయం పడుతుందని పేర్కొన్నారు.