పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
NEWS Jan 21,2025 05:40 pm
ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించారు. మండలంలోని పైడిమడుగు గ్రామంలో పార్టీ కార్యకర్త సంజీవ్ తండ్రి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం, కల్లూరు గ్రామంలోని సిపెల్లి రవీందర్ కుటుంబాన్ని పరామర్శించి గంగమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, స్థానిక మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మాజీ ఉప సర్పంచ్ రాకేష్, నరసయ్య, దశరథం, ఆంజనేయులు, సంజీవ్, చీటి వెంకట్రావు తదితరులు ఉన్నారు.