మున్సిపల్ ఉద్యోగి ముజీబ్ కు సన్మానం
NEWS Jan 21,2025 04:17 pm
పాలకవర్గ పదవి విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవంలో భాగంగా సానిటేషన్ విభాగంలో పనిచేసే మున్సిపల్ ఉద్యోగి అయిన ముజీబ్ కు శాలువాతో సన్మానించారు. MLA కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని మెట్ పల్లి పట్టణంలో గతంలో కంటే పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇతర ఉద్యోగులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రణవేణి సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు, మున్సిపల్ కమిషనర్ టి మోహన్ తదితరులు పాల్గొన్నారు.