అమెరికా ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ కోరారు. దావోస్ లో జరిగిన ఎకామిక్ ఫోరంలో స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రతినిధులతో చర్చించారు. గ్రూపు స్ట్రాటజిక్ గ్లోబల్ అడ్వయిజర్ ఫణి శ్రీపాద, సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రతిపాదిత ప్రపంచ స్థాయి గోల్ఫ్ సిటీని ఎపిలో ఏర్పాటైతే ఏపీ ఆర్థికంగా మరింత బలపడుతుందన్నారు. దీనికి సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.