అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నూతన అధ్యక్షునిగా జయంత్ చల్లా ప్రమాణస్వీకారం చేశారు. 2025-2027 కాలానికి గానూ అధ్యక్ష బాధ్యతలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జయంత్ సతీమణి కవిత చల్లా కూడా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక ప్రక్రియ విషయంలో ఆటా బోర్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో త్వరలోనే మళ్లీ ATA బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు నూతన అధ్యక్షుడు జయంత్ చల్లా ప్రకటించారు.