కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నక్సలిజం అంతిమ దశకు చేరుకుందన్నారు. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మందికి పైగా నక్సల్స్ మృతి చెందారు. మన భద్రతా దళాలకు ఇది గొప్ప విజయంగా అభివర్ణించారు. నక్సలైట్లు లేని భారత్ దిశగా కీలక అడుగు వేశామన్నారు. నక్సలిజం నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్నది తమ సంకల్పమని స్పష్టం చేశారు.