తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్త సందోహం
NEWS Jan 21,2025 06:28 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 83 వేల 806 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 352 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా రూ. 3.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. స్వామి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 6 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.