మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. కృష్ణా జలాల విషయంలో స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. కృష్ణా ట్రిబ్యునల్ అంశంపై హరీశ్ రావు చిల్లర రాజకీయాలు చేశారంటూ ధ్వజమెత్తారు. పోతిరెడ్డి పాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకుని ప్రవర్తించారంటూ ఫైర్ అయ్యారు.