ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పనిగట్టుకుని తనపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో రూ. 10 లక్షలు ఖర్చు చేయాలన్నా బోర్డు చైర్మన్, సభ్యుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.