కామారెడ్డి పట్టణంలో ఉన్న శ్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని కామారెడ్డి పట్టణాభివృద్ధి సంఘం సభ్యులు సోమవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియను కోరారు. ఈ మేరకు ఛైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ.. పట్టణంలో హిందూ శ్మశాన వాటికలు ఇందిరానగర్, పెద్ద చెరువు కింద ఉన్నాయన్నారు. ఈ రెండు కూడా ముళ్లపొదలతో నిండిపోయి ఎలాంటి సౌకర్యాలు లేవని తెలిపారు. ముళ్లపొదలు తొలగించి బోరు నీటి సదుపాయం కల్పించాలని కోరారు.