తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మెట్ పల్లిలోని మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ వారు పెరుగుతున్న ధరల గురించి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వారానికి మూడుసార్లు కోడిగుడ్లు ఇవ్వాలని ఆదేశించారు. వీటి ధర ఒక కోడి గుడ్డుకు ₹ 5 చొప్పున ఇస్తామన్నారు కానీ మార్కెట్ ధర ప్రకారం అదనంగా ₹ 3 నష్టపోతున్నామన్నారు.