మెట్ పల్లి మండలంలోని అల్లూరి సీతారామరాజు తండాకు చెందిన గుగ్గోత్ అరుణ్ నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అరుణ్ పనిచేస్తున్న కంపెనీలోనే కేరళకు చెందిన అజిత అనే యువతి పనిచేస్తుండగా.. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం రాత్రి కేరళలో వారి వివాహం సంప్రదాయం ప్రకారం జరిగింది.