కామారెడ్డి ప్రజావాణిలో 118 దరఖాస్తులు
NEWS Jan 20,2025 07:57 pm
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు పలు సమస్యలపై ప్రజావాణి లో అర్జీలను సమర్పించడం జరిగిందని, దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ సమస్యలు, ప్రజల సమస్యలు సంబందించిన అధికారులు స్పందించి పరిష్కారం చేయాలనీ ఆదేశించారు