నిజామాబాద్ జిల్లా న్యూస్ పేపర్ సర్క్యులేషన్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా మర్క భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని తిలక్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మర్క భాస్కర్, ఉపాధ్యక్షులుగా పీరోళ్ల సాయినాథ్, దామోదర్ రెడ్డి, కార్యదర్శిగా టి తుకారాం, కోశాధికారిగా ఎ స్కైలాబ్ గౌడ్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.