అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు
NEWS Jan 19,2025 08:58 pm
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు రేషన్ కార్డులే ఇవ్వ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి లబ్ది చేకూరేలా ముందుకు వెళ్తున్నామన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభల్లో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తారని చెప్పారు.