వెంటిలేటర్ నుంచి ఏపీకి విముక్తి
NEWS Jan 19,2025 08:24 pm
ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్‌ఎఫ్ మొదట గుర్తొస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జపాన్, నేపాల్, తుర్కియేలో ప్రకృతి విపత్తులు వచ్చినపుడు సేవలు అందించిందని ఆయన గుర్తు చేశారు. యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలను ఎన్డీఆర్‌ఎఫ్ పరిష్కరించిందని చెప్పారు. దేశంలో సమస్యల పరిష్కారానికి అమిత్‌షా పట్టుదలతో కృషి చేస్తున్నారని కితాబు ఇచ్చారు. కేంద్రం సాయంతో ఏపీ ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి బయట పడిందన్నారు సీఎం.