గిరిజనులు నాయకులుగా ఎదగాలి
NEWS Jan 19,2025 08:14 pm
గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచు కోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. గిరిజన ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక పథకాలు తెస్తున్నారని చెప్పారు. తండాల్లో అక్షరాస్యత పెంపునకు పెద్దపీట వేయాలన్నారు. గిరిజనులు వారి స్వభాషతో పాటు తెలుగు, ఆంగ్లం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.