మంత్రి అచ్చెన్నాయుడు జగన్ పై మండిపడ్డారు. వైసీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలకు తెర లేపి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. ప్రజలు అందుకే వైసీపీకి చెంప ఛెళ్లుమనిపించేలా 11 సీట్లకే పరిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు.