కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. చేతకాక పోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. పాలనా పరంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదన్నారు. కేవలం ప్రచారం కోసం ప్రయత్నం చేయడం తప్పా ఆయన చేసింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.