భారత దేశానికి చెందిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నాడు. సోనిపట్ కు చెందిన హిమానీని వివాహం చేసుకున్నాడు. తను ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. ఆమె అక్కడ చదువుకుంటోంది. వారిద్దరూ హానీమూన్ కోసం దేశం విడిచి వెళ్లారు. నీరజ్ చోప్రా తన వివాహానికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రెండు రోజుల కిందట మ్యారేజ్ జరిగిందని తెలిపాడు నీరజ్ మామ భీమ్.