ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 19లోని భక్తుల శిబిరంలో రెండు సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అగ్నిమాపక సిబ్బంది. హుటా హుటిన సీఎం యోగి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎంతో ఫోన్ లో మాట్లాడారు పీఎం మోడీ. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం సంభవించ లేదని తెలిపారు సీఎం.