ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ -5లోని భక్తుల శిబిరంలో రెండు సిలిండర్లు పేలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 టెంట్లు దగ్ధం కావడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. భయంతో భక్తులు పరుగులు తీశారు. మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేశారు. ఘటనా స్థలాన్ని సీఎం యోగి ఆదిత్యానాథ్ సందర్శించారు.