జగిత్యాల: రేపు ప్రజావాణి రద్దు
NEWS Jan 19,2025 06:18 pm
జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి ( రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు) సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.