యాత్రికుల వాహనానికి ప్రమాదం - 40 మందికి పైగా గాయాలు
NEWS Jan 19,2025 05:13 pm
ఆదిలాబాద్ జిల్లాలో యాత్రికుల వాహనం ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దాదాపు 47 మంది భక్తులకు గాయాలయ్యాయి. నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్లో యాత్రికులు ప్రయాణిస్తోన్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులు గాయపడగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108, ప్రైవేట్ వాహనాల్లో రిమ్స్, నార్నూర్, ఉట్నూర్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.