పోలీస్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించిన డీజీపీ జితేందర్
NEWS Jan 19,2025 04:13 pm
కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో క్యాసంపల్లి శివారులో గల పోలీస్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు పోలీస్ గెస్ట్ హౌస్ ను తెలంగాణ డీజిపీ జితేందర్ రేంజ్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. విధి నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు పోలీస్ శాఖ సేవలను అందించాలన్నారు. కేసుల పరిష్కారం పట్ల ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.